మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్

మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్

ములుగు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ  మెడికల్  కాంట్రాక్ట్ ఎంప్లా యిస్ యూనియన్  రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడిగా పెద్ద కాసు వినోద్ కుమార్  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా  వినోద్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 29న హైదరాబాద్లో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ములుగు జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు యూసఫ్, నర్సింహ, ఏఐటియుసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ లకు ధన్యవాదాలు తెలిపారు. మెడి కల్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.

Leave a Comment