మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరాన్ని పురస్క రించుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు మండలంలోని పంభాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి రామస్వామి, ముక్తి శ్రీను బ్రద ర్స్ లు సోమవారం పంభాపూర్ లోని పిల్లలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. గ్రామంలోని అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతక్క ఆదేశాల మేరకు నూతన సంవత్సర సందర్భంగా పిల్ల లందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అందరూ మంచి క్రమశిక్షణతో ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంభాపూర్ కారోబరు కల్తీ మల్లయ్య, చుంచ రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు

.

1 thought on “మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ”

Leave a Comment