విరాట్‌ ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌

రెండో టెస్టు కోసం స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ముమ్మర ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాడు. న్యూ ఇయర్‌ రోజునూ వదలకుండా నెట్స్‌లో గంటపాటు చెమటోడ్చాడు. ఆరంభంలో సెంట్రల్‌ నెట్స్‌లో..

కేప్‌టౌన్‌: రెండో టెస్టు కోసం స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ముమ్మర ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాడు. న్యూ ఇయర్‌ రోజునూ వదలకుండా నెట్స్‌లో గంటపాటు చెమటోడ్చాడు. ఆరంభంలో సెంట్రల్‌ నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కోగా, తర్వాత అవుట్‌ సైడ్‌ నెట్స్‌లో అర్ధగంట పాటు వేగంగా వచ్చే త్రోడౌన్స్‌ను ఆడాడు. ముఖ్యంగా లెఫ్టామ్‌ పేసర్‌ బౌలింగ్‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్‌ సాధన చేశాడు. భారత జట్టులో ఇలాంటి బౌలర్‌ లేకపోవడంతో స్థానిక బౌలర్‌ చేత బంతులను వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఎడమచేతి పేసర్‌ బర్గర్‌ను దృష్టిలో ఉంచుకునే తను ఈ ప్రాక్టీస్‌ సాగించాడు. ఇక శ్రేయాస్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కొనే బలహీనత తొలి టెస్టులోనూ కనిపించింది. అలాగే నెట్స్‌లో త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ నువాన్‌ సెనెవిరత్నె వేసిన బంతులను కూడా సరిగా ఆడలేకపోయాడు. ఇందులో ఓ బంతిని పుల్‌ షాట్‌ ఆడేందుకు చూడగా, అది పొట్టను తాకడంతో కాసేపు ప్రాక్టీస్‌ కూడా ఆపాల్సి వచ్చింది.

Leave a Comment