రాజస్థాన్‌పై యోధాస్‌ గెలుపు

అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌ సీజన్‌-2లో తెలుగు యోధాస్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్‌ 34-27తో రాజస్థాన్‌ వారియర్స్‌పై నెగ్గి,…

కటక్‌: అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌ సీజన్‌-2లో తెలుగు యోధాస్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్‌ 34-27తో రాజస్థాన్‌ వారియర్స్‌పై నెగ్గి, కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించింది. ఆట ప్రథమార్ధంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలవగా, ద్వితీయార్ధంలో యోధాస్‌ పుంజుకోవడంతో రాజస్థాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. అటాకర్‌ ప్రతీక్‌ (8 పాయింట్లు) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ, కీలక సమయాల్లో పాయింట్లు సాధించడం యోధా్‌సకు లాభించింది. ఆట చివర్లో డిఫెండర్‌ ఆదిత్య 2 నిమిషాల 48 సెకన్ల పాటు ప్రత్యర్థులకు చిక్కకుండా యోధా్‌సను విజయతీరాలకు చేర్చాడు. మరో మ్యాచ్‌లో చెన్నై క్విక్‌ గన్స్‌ 35-29తో గుజరాత్‌ జెయింట్స్‌పై నెగ్గింది.

Leave a Comment