బ్యాంకులో చొరబడిన దొంగ.. బయటి నుంచి తాళం వేసిన స్థానికులు

బ్యాంకును దోచుకుందామని వచ్చిన ఓ దొంగ అడ్డంగా బుక్కై పోలీసుల చేతికి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీకి యత్నించిన ఓ దొంగ.. ప్రధాన ద్వారం నుంచి లోపలికి చొరబడగా.. సైరన్ మోగటంతో స్థానికులు చాకచక్యంగా బయటి నుంచి తాళం వేసి దొంగను బంధించారు. అనంతరం పోలీసులు వచ్చి ఆ దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Indian Overseas Bank Robbery: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నట్టుగా ఓ దొంగ అడ్డంగా బుక్కయిపోయాడు. బ్యాంకులో దొంగతనం చేయాలంటే.. కేవలం తాళం పగలగొట్టొస్తే చాలు అనుకున్నాడో ఏమో.. లోపల ఎలాంటి భద్రత ఉంటుంది అన్నది తెలుసుకోకుండా వచ్చి.. ఇరుక్కుపోయాడు. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ సైరన్‌లతో బ్యాంకులకు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేస్తున్న విషయం తెలియదు కాబోలు.. దర్జాగా దోచుకుందామని వచ్చి.. నేరుగా వచ్చి బోనులు ఎలుక పడినట్టు.. బ్యాంకులోకి దూరి నేరుగా పోలీస్ స్టేషన్‌లో పడ్డాడు.

2 thoughts on “బ్యాంకులో చొరబడిన దొంగ.. బయటి నుంచి తాళం వేసిన స్థానికులు”

Leave a Comment