‘నిజం గెలవాలి’ యాత్ర.. మరోసారి జనంలోకి నారా భువనేశ్వరి!

Nara Bhuvaneshwari Nijam Gelavali మరోసారి జనాల్లోకి నారా భువనేశ్వరి. బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన.. మూడు రోజులు నిజం గెలవాలి యాత్ర.. షెడ్యూల్ విడుదల చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి జనంలోకి వెళుతున్నారు. నిజం గెలవాలి పేరుతో మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ ‘నిజం గెలవాలి’ పేరిట పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు.. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున వారికి ఆర్థిక సాయం కూడా అందించారు. అయితే విజయనగరం పర్యటనకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో ఆమె నిజం గెలవాలని యాత్ర ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నారు నారా భువనేశ్వరి.

Leave a Comment