ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణ కంటే డబుల్, ఈ జిల్లాలో ఎక్కువ!

Andhra Pradesh Corona Cases ఏపీని కరోనా కలవరపెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజా బులిటెన్ ప్రకారం కేసులు సెంచరీని దాటేసింది.. కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం టెన్షన్ పెడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. స్పెషల్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే కరోనా పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. రాష్ట్రంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. అలాగే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా జనాల్ని వణికిస్తోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశం మొత్తం మీద ప్రతి రోజూ 500కుపైగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. ఏపీలో కేసుల సంఖ్య 119కి చేరింది. ఇంకా పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేసులు బయటపడతాయంటున్నారు. ఈ కేసుల్లో జేఎన్ 1 వైరస్ పేషెంట్లు కూడా ఉన్నారు. పరిస్థితిని బట్టి అవసరమైన వారిని ఆస్పత్రిలో.. మిగిలిన వారిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచుతున్నారు. విశాఖ, విజయవాడ, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, బాపట్ల ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణతో పోలీస్తే ఏపీలోనే కేసులు ఎక్కువ.. తెలంగాణలో ప్రస్తుతం 50 కేసులు ఉన్నాయి.

Leave a Comment