అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 21 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి సోది చెబుతున్నారంటూ అంగన్వాడీలు ఎద్దేవా చేశారు.

అంగన్వాడీల వినూత్న నిరసన

విజయనగరం(ఆంధ్రజ్యోతి) జనవరి 1 : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 21 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి సోది చెబుతున్నారంటూ అంగన్వాడీలు ఎద్దేవా చేశారు. సీఐటీయూ మద్దతుతో తాజాగా సోమవారం కలెక్టరేట్‌ వద్ద వినూత్న నిరసనకు దిగారు. సమస్యలు, హామీలు పరిష్కరించాలని కోరితే పరిష్కరించకుండా జగన్‌, మంత్రులు చెప్పిందే పలుమార్లు చెబుతూ సోది మాట్లాడుతున్నారని నాయకులను అనుకరించారు. శిబిరంలో కూర్చొని సోది చెప్పుకున్నారు. ఈ ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. జిల్లా యూనియన్‌ నాయుకురాలు బి.పైడిరాజు మాట్లాడుతూ 21 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేకపోవటం దురదృష్టకరమన్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పాటలు పాడి డ్యాన్స్‌లు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జగన్మోహన్‌, సుశీల, ఉష తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment